లంచగొండి కొడుకు

మిట్ట మధ్యాహ్నం కారులో చిన్నకుటుంబం ఒకటి. ఇంటినుండి సరదాగా బయటకు వెళుతున్నారు.
పచ్చ దీపం ఎరుపుకు మారింది. కారు మెల్లగా ఆగింది.

అమ్మ ఎప్పటి నుండో అడగాలనుకుంటుంది
“ఏవండి, ఆ ఇళ్ళ నిధులు వచ్చాయా”
అయ్యకేమో పని గురించి మాట్లాడడం అంత ఇష్టం లేదు. అదీ బల్లక్రింది వ్యవహారం. మాటలాడం లో ఆశక్తి లేదని తెలియజెప్పడానికి నీరసం గా “ఊఁ” అని సమాధానమైతే ఇచ్చాడు.
” మనకు ఎంత వస్తాయంటున్నారండి? ”
” చూడాలే ఆ ప్యూను జగన్నాథం మరీ అన్యాయంగా మాట్లాడుతున్నాడు. పెద్దా చిన్నా లేకుండా పోతుంది ఈ మధ్య ఆఫీసులో ”
” తొందరగా వస్తే, బాబ్లీ అమెరికా చదువుల కోసం ఆ స్ధలం కొనోచ్చు, అసలే ఈ మద్య స్కాలర్ షిప్పులు రావట్లేదట, రేఖ గారి అబ్బాయికి కూడా రాలేదట ”
భార్య చాలా దూరం ఆలోచించినా, పిల్లాడి చదువులకోసం భూమి ఎప్పటికైనా కొనల్సిందేగ్ అని “ఊఁ” అన్నాడు.

ఈలోగా వెనక సీటులో పన్నెండేళ్ళ బాబ్లీ కిటికీ మీద టక్ టక్.
“బాబూ బూర కొనండి బాబూ, పిచ్చుక బూర బాబూ, ఊదితే రెక్కులు వస్తాయి” ఆకుర్రాడికి కూడా బాబ్లీ వయసుంటుంది.
“నువ్వేంచేస్తూంటావ్”
“బడికేళ్తూ ఆదివారం ఇలా ఏదోటి అమ్ముతుంటాను”
“ఎంత బూర ఒక్కోటి?”
“పది రూపాయలు”
“ఐతే ఒ ఐదు ఇవ్వు” పాకెట్ మని తీసిచ్చాడు.
“ఐదా?” ఐదు బూరలు ఒకరికే అమ్మడం ఇదే మొదటి సారి అతనకు.
“ఊఁ, నా స్నేహితులు చాలా మంది ఉన్నారులే”
“థాంక్స్”
“ఇంతకీ ఎక్కడుంటావేంటి ?”
“సత్యవాడ”

ట్రాఫిక్ దీపం పచ్చకు మారింది, కారు కదలసాగింది.
“ఇంతకూ ఏ వాడలో ఇళ్ళకోసమండి అవి?”
“ఎన్ని ప్రశ్నలడుగుతావే, నస”
“ఇంకా అడగను లెండి ఐతే”
“సత్యవాడ”

Published in: on మే 1, 2007 at 7:02 సా.  3 వ్యాఖ్యలు  

The URI to TrackBack this entry is: https://trinetram.wordpress.com/2007/05/01/%e0%b0%b2%e0%b0%82%e0%b0%9a%e0%b0%97%e0%b1%8a%e0%b0%82%e0%b0%a1%e0%b0%bf-%e0%b0%95%e0%b1%8a%e0%b0%a1%e0%b1%81%e0%b0%95%e0%b1%81/trackback/

RSS feed for comments on this post.

3 వ్యాఖ్యలువ్యాఖ్యానించండి

  1. mee praythnam bagundi

  2. చాలా బాగారాసారు.ప్రయత్నిస్తే దీన్ని 55 పదాల కధ చెయ్యొచ్చేమో.

  3. ఇక్కడ 55 అనే సంఖ్య లక్ష్యం కాదు – సాధ్యమైనంత క్లుప్తంగా కథ చెప్పటం లక్ష్యం. మీ ప్రయత్నం చాలా అర్థవంతంగా ఉంది. రాధికగారు చెప్పినట్టు .. ఇంకొంచెం కుదించవచ్చు. మధ్యలో కథకుడి గొంతు చెబుతున్న వివరణలు లేకపోతే కథలో పట్టు ఇంకా బాగుంటుంది.


వ్యాఖ్యానించండి